భూపాలపల్లి, మహా :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని గురువారం జాతీయకమిషన్ అడిషనల్ డిజిపికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈవార్త భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం పూర్వపు డీఎస్పీ జి రామ్మోహన్ రెడ్డి, కాలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ తమాషా రెడ్డి లపై ఎస్సీ ఎస్టీ,కేసులు నమోదు చేయాలని అడిషనల్ డీజీపీకి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మహదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన చకినారపు రవిపై లేని కేసును ఉన్నట్లు కాలేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి పివిసి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం విచారణలో అది తప్పని తేలింది. ఈ మేరకు చకినారపు రవి ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎస్సై, డిఎస్పి లపై కేసు నమోదు చేయాలని జాతీయ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ కేసును సుమోటోగా విచారణ కు స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ భూపాలపల్లి జిల్లా ఎస్పీని సైతం బాధ్యుడిగా చేసి ముగ్గురి పైన కేసు నమోదు చేసి 15 రోజుల్లోగా నివేదిక అందజేయాలని అడిషనల్ డీజీపీని జాతీయ కమిషన్ ఇచ్చినే ఉత్తర్వు లో పేర్కొంది








