వరంగల్ మహా;
స్వచ్చ సర్వేక్షన్ -2024 లో వరంగల్ మహా నగర పాలక సంస్థ జాతీయ స్థాయి లో 22 వ, రాష్ట్ర స్థాయి లో 3- 10 లక్షల జనాభా కేటగిరి లో వరంగల్ మహా నగరానికి అగ్రస్థానం దక్కింది. రాష్ట్ర స్థాయిలో సమగ్రంగా 4వ స్థానం సాధించింది.
ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ( ODF)+,+ సిటీ గా నగరం గత 6 సంవత్సరాలుగా గుర్తింపు పొందుతూ అదే ఒరవడిని నిరంతరం గా కొనసాగిస్తూ స్థిరమైన పారిశుద్ధ్య నిర్వహణకు నిదర్శనంగా నిలుస్తూ ఈ సారి కూడా ఘనతను గ్రేటర్ వరంగల్ దక్కించుకుంది.
ఈ విజయాల వెనుక ప్రజల భాగస్వామ్యం, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ, తో పాటు పారదర్శక పాలన ఉన్నాయి. ప్రతి ఇంటి నుండి తడి,పొడి వ్యర్థాలను వేరుగా సేకరించడం, ఇంటి వద్ద కంపోస్టింగ్ తయారీ, రెండు డబ్బాల వినియోగంపై దృష్టి పెట్టి అవగాహన కల్పించడం ద్వారా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. సానిటేషన్ కార్మికులకు శిక్షణ, పర్యవేక్షణ వ్యవస్థలు, ఐఈసీ ప్రచారాల ద్వారా శుభ్రత ఉద్యమంగా మారింది.
వరుసగా ఆరు సార్లు 2019, 2020, 2021, 2022,2023,2024 సంవత్సరాలలో ODF ++ లో చోటు దక్కడం తో వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ హ్యాట్రిక్ ను దాటి ఘనత సాధించిన అతి కొద్ది నగరాల్లో చోటు దక్కింది. మహా నగరంలో బహిరంగ రహిత మల, మూత్ర విసర్జనకు తగినన్ని పబ్లిక్ టాయిలెట్లు, ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆధునిక విధానాల ద్వారా టాయిలెట్లు నిర్వహణ, శాస్త్రీయ పద్ధతుల్లో మానవ వ్యర్ధాల శుద్ధికరణ చేపట్టడం జరుగుతున్నది.
మహా నగరానికి ఉత్తమ ర్యాంకు దక్కడం హర్షణీయమని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు.
బల్దియాకు జాతీయ స్థాయి లో 22, రాష్ట్ర స్థాయి లో 4 వ స్థానం, రాష్ట్రం లో అగ్ర స్థానం , రాష్ట్ర స్థాయి లో సమగ్రంగా 4 వ స్థానం, దక్కడానికి సహకరించిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ , పర్యావరణ , దేవాదాయ మంత్రి కొండా సురేఖ, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు, సాధించడానికి కృషి చేసిన జీ డబ్ల్యూ ఎం సి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కార్పొరేటర్లకు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు, నగరప్రజలకు ఈ సందర్భం గా మేయర్ ధన్యవాదాలు తెలిపారు.








