Mahaa Daily Exclusive

  రైల్వే జీఎం ను కలిసిన ఎమ్మెల్యే నాయిని కాజీపేట బస్ స్టాండ్ ఏర్పాటు స్థల ప్రక్రియ వేగవంతం చేయాలని వినతి..!

Share

హన్మకొండ మహా;

సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గా నూతనంగా నియమితులై గురువారం కాజీపేటకు విచ్చేసిన సంజయ్ కుమార్, శ్రీవాస్తవ్ ను కాజీపేట రైల్వే స్టేషన్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్, విష్ణు వర్ధన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన జీఎం కు ఎమ్మెల్యే నాయిని స్వాగతం తెలిపారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ
హనుమకొండ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి రోడ్డు మార్గం కాజీపేట మీదుగా ఉన్నదని కాజీపేట లో బస్ స్టాండ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.గతంలోనె రైల్వే శాఖకు కాజీపేట రైల్వే స్టేడియం లో ఉన్న స్థలాన్ని మంజూరు చేయాలని కోరడం జరిగిందని బస్ స్టాండ్ నిర్మాణం కోసం స్థల కేటాయింపు ప్రక్రియ సానుకూల దృక్పథంలో వేగవంతం చేయాలని లేక ద్వార పేర్కొన్నారు. ముఖ్యంగా కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ,ఉపాధి రంగాల్లో 50% ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గతంలో ఆగిపోయిన రైళ్లను పునః ప్రారంభించి కాజీపేటలో హాల్టింగ్ కల్పించాలని రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జంట నగరాలుగా ఉన్న ఈ ప్రాంతంలో రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత ఉందని తెలిపారు.
ఎమ్మెల్యే నాయిని కోరిన అంశాలపై జీఎం సానుకూలంగా స్పందించారు.

Latest