హన్మకొండ మహా;
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హనుమకొండ నగరం లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మంచి నీరు ప్రధానమని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నీటి ఎద్దడి లేకుండా చూసే బాధ్యత మనందరి పై ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం వర్ధన్నపేట శాసన సభ్యులు కే ఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, నగర కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలసి వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్, కాజీపేట వాటర్ ట్యాంక్ లను సందర్శించి
ఫిల్టర్ బెడ్ లోపల నీటి శుద్ధి పద్ధతిని, నిల్వ సామర్ధ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ఫిల్టర్ బెడ్ మరమత్తులకు రూ.2.50 కోట్ల పై చిలుకు నిధులతో సుందరీకరణ పనులను చేస్తామని తెలిపారు. నూతనంగా 5 ఎంఎల్ డి కెపాసిటీగల ట్యాంక్ లను గోపాలపూర్, కాజీపేట,వడ్డేపల్లి లలో నిర్మించాలని కావాల్సిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అధికారులకు క్షేత్ర స్థాయి సిబ్బందికి సమన్వయ లోపం వలన ప్రజలకు నీటి సమస్య కలుగుతుందని తెలిపారు. ఫిల్టర్ బెడ్ బయట లోపల నిఘానేత్రాలు ఉండేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.








