రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో ఇందిరమ్మ మహిళ శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా శక్తి సంబరాల్లో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం చేశారు. మహిళలు బోనాలు ఎత్తుకొని, ఆటపాటలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వయం ఉపాధి కోసం డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం మహిళలకు స్వయం సహాయక ఉపాధి సంఘాలకు, విఎల్ఆర్ ద్వారా నాలుగు కోట్ల 96 లక్షల రూపాయలు, బ్యాంకుల ద్వారా 41 కోట్ల 10 లక్షల రూపాయల రుణాలను మహిళా డ్వాక్రా సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ తోడ్పాటు అందించడం జరుగుతుంది ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సంఘాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి తోడుబాటు ఎప్పటికీ ఉంటుందన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 కి గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్య విద్యుత్, మహిళలకు అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మహిళా మణులు డ్వాక్రా సంఘాల మహిళా మణులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు….








