Mahaa Daily Exclusive

  విద్యుత్ శాఖలో పోస్టుల వినియోగంపై సమీక్ష ఖమ్మంలో సర్కిల్ స్థాయి సమావేశం. * డివిజనల్ ఇంజినీర్లు, యూనియన్ నేతలతో చర్చ…!

Share

ఖమ్మం,మహా.
తెలంగాణ విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ పరిధిలో ఇటీవలే రద్దు చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే మంజూరైన సీనియర్ అసిస్టెంట్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, ఆఫీస్ సబ్‌ఆర్డినేట్ పోస్టుల వినియోగంపై సమగ్ర చర్చ జరిపే ఉద్దేశంతో ప్రత్యేక సమీక్షా సమావేశం గురువారం నిర్వహించబడింది.

ఈ సమావేశం ఖమ్మం సర్కిల్ ఆఫీస్‌లో సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆపరేషన్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అధ్యక్షతన ప్రారంభమైంది. ఉద్యోగుల నియామకాలు, పోస్టుల పునర్విభజన, విభాగాల అవసరాలపై అధికారులు, ఖాతాదారుల విభాగం మరియు ట్రేడ్ యూనియన్ల నేతలతో మంతనాలు జరిపారు.

ఈ సమావేశంలో డివిజనల్ ఇంజినీర్లు చిన్న బాబు రావు, రామరావు, నాగేశ్వర రావు, రాములు, భద్రు పవార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీధర్, పర్సనల్ ఆఫీసర్ తిరుపతి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నరేష్ కుమార్ పాల్గొన్నారు.

అలాగే ఉద్యోగ సంఘాల తరఫున ప్రముఖ నాయకులు శేషగిరి రావు, రమణా రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సీతారామ్ గోపాల్, శ్రీనివాస్, ఉపేందర్, ప్రసాద్, కె. నాగేశ్వరరావు, బీవీఎస్ మూర్తి, ఎం. శ్రీనివాస్ సమావేశంలో హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఉన్నతాధికారులు తమ ప్రాంతాలకు అవసరమైన మానవ వనరులపై స్పష్టమైన అవగాహన కలిగి, పోస్టుల వినియోగాన్ని సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగులు సమన్వయంతో ముందుకు సాగితే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని సభలో స్పష్టం చేశారు.

Latest