Mahaa Daily Exclusive

  విలువైన బాల్యాన్ని ఉజ్వల భవిష్యత్తు కై మార్గం చేసుకోవాలి _న్యాయ చైతన్య సదస్సులో మాజీ ఏజీపీ సుబ్రమణ్యం..!

Share

మధిర, మహా.
భవిష్యత్తు ఉజ్వలo చేసుకునేందుకు బాల్యం విలువైనదని నేటి విద్యార్థులు విద్యార్థి దేశనుండే లక్ష్యం దిశగా అడుగేయాలని ప్రముఖ న్యాయవాది మాజీ ఏజిపి దేవరపల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ను పురస్కరించుకొని గురువారం మడుపల్లి లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో న్యాయ చైతన్య సదస్సు ను హెచ్ఎం తోట నరసింహులు నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ,
భారత న్యాయ సంహిత, ఫోక్సో, బాల నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, మత్తు పదార్థాల స్మగ్లింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాటుతో ఎంతో విలువైన జీవితాలు నాశనం అవుతున్నాయని, విద్యార్థులకు చట్టం పట్ల సరైన అవగాహన ఏర్పాటు చేసుకుంటూ తద్వారా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పౌరులుగా బాధ్యతాయుతమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్ పర్సన్ వేమిరెడ్డి నాగలక్ష్మి, బూసా కోటేశ్వరరావు, జ్ఞానేశ్వర చారి ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Latest