AP: జనసేన కార్యకర్త రాయుడు హత్య కేసులో, ఆ పార్టీ సస్పెండెడ్ నేత వినుత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రాజకీయ కోణంలో తనపై వైసీపీ తీవ్ర అభాండాలు వేస్తోందన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామి సాక్షిగా, కుటుంబం సాక్షిగా తాను నిజం చెబుతున్నానని తెలిపారు. కాగా, ఈ నెల 8న చెన్నైలో రాయుడు మృతదేహాన్ని గుర్తించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 31








