మిర్యాలగూడ మహా
పట్టణంలోని కెఎన్ఎం డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మల్గిరెడ్డి భీమార్జునరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. తెలుగు ఒకటి, కామర్స్ ఒక, రసాయన శాస్త్రంలో ఒకటి, జంతుశాస్త్రంలో ఒకటి, కంప్యూటర్ సైన్స్ లో ఒక పోస్టుకు జనరల్ కేటగిరీ 55 శాతం మార్కులు, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు పోస్టు గ్రాడ్యూయేషన్ లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలనీ తెలిపారు. దరఖాస్తులను స్వయంగా ఈ నెల 24 సాయంత్రం 4 గంటల వరకూ కళాశాలలో అందజేయాలని ఆయన తెలిపారు. పిహెచ్డి, నెట్, సెట్ ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. కాలేజియేట్ కమిషనర్ నిబంధనల ప్రకారం జరుగుతుందని ఆయన తెలిపారు.
Post Views: 10








