Mahaa Daily Exclusive

  చలో హైదరాబాద్ ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ దినోత్సవం జయప్రదం చేయండి..!

Share

మిర్యాలగూడ మహా
ఆగస్టు 3న హైదరాబాద్ బాగ్
లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి 29 ఆవిర్భావ దినోత్సవ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జగిరి అంజయ్య కోరారు. మిర్యాలగూడ సంఘ కార్యాలయంలో శనివారం జరిగిన నల్గొండ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వందలాదిమంది ఎరుకల బిడ్డలు తరలిరావాలని భూమి పై పుట్టిన మొట్టమొదటి ఆదివాసి బిడ్డలని భూమి పుత్రులమని పేర్కొంటూ
వేడుకను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో మూడు లక్షలపైగా ఉన్న ఆదివాసులు ఎరుకల ప్రజల ఇబ్బందులను గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి ఎరుకల హక్కుల సాధించుకోవడం కోసం వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచి ఎరుకల సోదరులు సోదరీమణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో పోల వెంకటేశ్వర్లు, ఉదరగిరి వెంకన్న, కంజల రవికుమార్, వజ్జగిరి కళ్యాణ్, కాండ్యల కలిస్ పాల్గొన్నారు.