Mahaa Daily Exclusive

  ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్భార్ ..!

Share

ఆదిలాబాద్, మహా

ఆదిలాబాద్ పట్టణం లోని ప్రజా సేవ భవన్ లో శనివారం ప్రజా దర్భార్ నిర్వహించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను కంది శ్రీనివాస రెడ్డి కి వివ‌రించి వినతి పత్రాలు అందించారు. సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ వ‌ద్ద‌కు చేర్చి ప‌రిష్కారం కోసం కృషి చేస్తానని కంది శ్రీ‌నివాస రెడ్డి తెలిపారు.ఈకార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,మునిగెల విట్టల్, బండారి సతీష్, సంద నర్సింగ్,అల్లూరి భూమ రెడ్డి, సుధాకర్ గౌడ్,కందుల సుకేందర్,మొహమ్మద్ రఫీక్,రాములు యాదవ్,అశోక్,తమ్మల చందు, రవీందర్,సురేందర్ రెడ్డి, వసంత్,శ్రీనివాస్ తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని న‌లుమూల‌ల నుండి ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

Latest