ఆదిలాబాద్, మహా :
తెలంగాణా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చూసి ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో భోరజ్ మండలం పెండల్ వాడ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. వారందరికి కండువాలు కప్పి ఆయన పార్టీలోకి స్వాగతించారు. పెండల్ వాడ నుండి కాంగ్రెస్ లోకి జరిగిన చేరికలతో గ్రామంలో పార్టీ మరింత బలపడిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరుగ్యారెంటీల అమలుతో పాటు సన్నబియ్యం, ఉద్యోగాలు, రుణమాఫీ, తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ఆమోదం కోసం పంపించిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచించేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. రానున్న పరిషత్ , పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం అందరం కలిసికట్టుగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,మునిగెల విట్టల్, బండారి సతీష్, సంద నర్సింగ్, అల్లూరి భూమ రెడ్డి, సుధాకర్ గౌడ్,కందుల సుకేందర్,మొహమ్మద్ రఫీక్,రాములు యాదవ్,అశోక్,తమ్మల చందు, రవీందర్,సురేందర్ రెడ్డి, వసంత్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








