అదిలాబాద్, మహా:
హజ్ యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన యాత్రికులను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి సత్కరించారు .శనివారం అదిలాబాద్ పట్టణంలోని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాత్రికులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి కంది శ్రీనివాస రెడ్డి అభినందించారు. అదిలాబాద్ జిల్లాలో హిందూ ముస్లీంల ఐక్యత గంగా-జమున సంస్కృతి లాంటిదని కొనియాడారు.అనంతరం అదిలాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్న కంది శ్రీనివాస రెడ్డి కృషిని కొనియాడారు. ఆయన సామాజిక సేవలను మెచ్చుకొని సత్కరించారు. రాబోయే ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జమీయత్ ఉలమా జిల్లా అధ్యక్షులు మౌలానా ముఫ్తీ అబ్దుల్ ఘనీ కాస్మీ, హాఫిజ్ అబూబకర్ హామిద్, ఐమ్మా మౌజిన్ల సంఘం అధ్యక్షులు హాఫిజ్ మహ్మద్ మన్జూర్ అహ్మద్, జిల్లా కాజీ సయ్యద్ నదీంఉద్దీన్, జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షులు షాహిద్ అహ్మద్ తవక్కల్, తదితరులు హాజరయ్యారు.








