Mahaa Daily Exclusive

  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన కంది శ్రీ‌నివాస‌రెడ్డి ..!

Share

ఆదిలాబాద్, మహా:

పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధినుండి వచ్చిన చెక్కులను శనివారం ఆయన లబ్దిదారులకు అందించారు. మొత్తం 1 లక్ష 20 వేల విలువ గల మూడు చెక్కులను బెల్లూరి కి చెందిన ఆకుల రాజ‌క్క రూ.60వేలు ,భుక్తాపూర్ కు చెందిన విజ‌య్ సింగ్ రూ.45వేలు , శాంతిన‌గ‌ర్ కు చెందిన ఉషారాణి రూ.15వేలు తన క్యాంపు కార్యాలయంలో అందించారు. సీఏంఆర్ ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసామని ఆసుపత్రుల్లో డబ్బుల పెట్టి వైద్యం చేయించుకున్నవారికి ముఖ్య మంత్రి సహాయ నిధినుండి ఆర్థిక సాయంకోసం దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో నియోజ‌క వ‌ర్గంలోని కాంగ్రెస్ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Latest