వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం
కరీమాబాద్ ఎస్ ఆర్ ఆర్ తోట ప్రాంతానికి చెందిన చంద్రయ్య ది అత్యంత నిరుపేద కుటుంబం.
చంద్రయ్య గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. కాగా డాక్టర్ల సలహా మేరకు ఆయనకు ఆక్సిజన్ మిషిన్ అత్యంత అవసరమని దీనిని వాడుతూ మందులు వేసుకుంటే తగ్గుతుందని లేకపోతే ప్రాణాపాయం ఉందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి
ఒక్కరోజు పని చేయకపోతే ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్న ఈ నిరుపేద కుటుంబం సుమారు 50 వేలకు పై ఉన్న ఆక్సిజన్ మిషన్ ను కొనే స్తోమత లేక 33 డివిజన్ కొండా దంపతుల వీరాభిమాని అయిన కోడం శివకృష్ణ ను సంప్రదించారు. చంద్రయ్య
విషయం విన్న కోడం శివ కృష్ణ వెంటనే వారి ఇంటికి వెళ్లి చంద్రయ్యను వారి కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయి, మీకు నేనున్నాను ఎంత ఖర్చైనా నేను మిషన్ తెప్పిస్తానని
వారిలో మనోధైర్యాన్ని కలిపించి 24 గంటల్లో సుమారు 52,000 రూపాయల విలువగల ఆక్సిజన్ మిషిన్ ను వారి కుటుంబానికి అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు.
ఈ సందర్భంగా చంద్రయ్య భార్య పద్మ మాట్లాడుతూ తన భర్త ప్రాణాలను, అలాగే తన కుటుంబాన్ని కాపాడడం కోసం కోడం శివకృష్ణ ఆక్సిజన్ మిషన్ మాకు ఇవ్వడం జరిగిందని అందుకు కోడం శివకృష్ణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అతని కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిట్ట నిశాంత్, భైరీ ప్రతాప్
కొమ్మరాజుల సందీప్, చందు, బొమ్మగాని శ్రీనివాస్ దిలీప్, శివ తదితరులు పాల్గొన్నారు.








