Mahaa Daily Exclusive

  అర్హులందరికీ రేషన్ కార్డులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..!

Share

భూపాలపల్లి, మహా :
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.
శనివారం గోరి కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం సంవత్సరం కాలంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు, కార్డుల్లో నూతన పేర్లు జత చేయడం
చేపట్టినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 5967 నూతన రేషన్ కార్డులు, 10349 అదనపు కుటుంబ సభ్యులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ఇట్టి కార్డులు మంజూరుతో 33,017 మంది సభ్యులు లబ్ది పొందుతున్నారని, అదనంగా 200 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నూతన రేషన్ కార్డులు జారీ, కుటుంబ సభ్యులు నమోదు చేయు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇంకనూ అర్హులై ఉండి రేషన్ కార్డు లేని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 8993 నూతన రేషన్ కార్డులు, 14949 మంది అదనపు కుటుంబ సభ్యులు నమోదు జరిగిందని తెలిపారు. ఇట్టి మంజూరు ద్వారా 48,524 మంది సభ్యులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఇందుకు గాను మొత్తం 300 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులోని ప్రతి సభ్యునికి 6 కిలోలు పంపిణీ జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ అర్హత మేరకు కార్డులు మంజూరు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాపాలన, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన వారందరికీ సమగ్ర విచారణ అనంతరం రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డులు ప్రజలకు చాలా ఉపయోగకరమని తెలిపారు.

ఈ నెల 21వ తేదీ సోమవారం రాష్ట్ర మంత్రుల పర్యటన

జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రుల చే జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
ఘోరి కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం, గణపురంలో పోలీస్ సర్కిల్ కార్యాలయం, చెల్పూర్ బస్ స్టాండ్, గ్రంథాలయ భవనం, టాస్క్ ఆధ్వర్యంలో యూత్ శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవాలు జరగనున్నాయని సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే, లబ్ధిదారులకు ఇందిరమ్మ రెండు పడకగదుల ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు.
కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ప్రతి కార్యక్రమం సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల పర్యటన విజయవంతం చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్
మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టప్ప, తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, ఎంపిడిఓ రాం ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.