భూపాలపల్లి, మహా : భూపాలపల్లి జిల్లా స్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు శనివారం కామిక్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ప్రపంచ జనాభా దినోత్సవం ను పురస్కరించుకొని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ ఆదేశానుసారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని యజమాన్య పాఠశాలల విద్యార్థులకు కామిక్ రైటింగ్ సంబంధించి జిల్లా స్థాయిలో భూపాలపల్లి ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహించారు. చాలా ఆలస్యం కాకముందే వద్దు అని చెప్పు (మాదక ద్రవ్య దుర్వినియోగం వ్యసనంలో పడకుండా ఉండడానికి ముందస్తు తిరస్కరణ మరియు అవగాహనను నొక్కి చెప్పడం) అనే నినాదంతో విద్యార్థులకు పోటీని నిర్వహించారు. ఈ పోటీలో 35 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఆంగ్లం, తెలుగు మరియు ఉర్దూ భాషలలో పోటీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతిని మహమ్మద్ ఫిర్దోస్ జడ్.పి.హెచ్.ఎస్ భూపాలపల్లి పాఠశాల కు, ద్వితీయ బహుమతి శివగ్రిష్మా ములుగు పల్లి ఉన్నత పాఠశాల మహముత్తారం మండలం, తృతీయ బహుమతి మాము నూరి నమాన్ జూకల్లు ఉన్నత పాఠశాల చిట్యాల మండలం గెలుపొందారు. ప్రథమ బహుమతి విజేతల కు నగదు బహుమతిగా 500 రూపాయలు, ద్వితీయ బహుమతి గా రూ 300, తృతీయ బహుమతిగా రూ 200 నగదును జిల్లా మానిటరింగ్ అధికారి కాగిత లక్ష్మణ్,మండల విద్యాశాఖ అధికారి అజ్మీర దేవా లు బహుమతులను పంపిణీ చేశారు . ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాలు పొందిన హాస్య చిత్రాలను రాష్ట్ర విద్య శిక్షణ పరిశోధన సంస్థకు పంపించడం జరిగింది వాటిని మ్యాగజైన్ రూపంలో ముద్రించడం జరుగుతుందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి కాగిత లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.







