వరంగల్ మహా ;
వరంగల్ జిల్లా సంగెం మండలంలోని సమాఖ్య లో శనివారం అదనపు గదులు, గీసుకొండ మండల సమాఖ్యలో ప్రహరీ గోడ నిర్మాణం పనుల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి అభివృధి పనులకు శంకుస్థాపన చేశారు.
సంగెం శాంతి మండల సమైక్య అదనపు గదులకు 8 లక్షలు,
గీసుకొండ ప్రగతి మండల సమైక్య కు కాంపౌండ్ గోడ నిర్మాణానికి 10 లక్షల రూపాయలను ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక దేశ ప్రగతి మహిళ ప్రగతి పైననే ఆధారపడి ఉంటుందని చెప్పడం జరిగిందని వారి సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
మహిళలు సర్వశక్తి సంపన్నులు వంట చేయడమే కాదు వ్యాపారము చేయగలరని అన్నారు.
ఆశ వర్కర్ల నుండి అంతరిక్షం వరకు మహిళలు ఎక్కడ తగ్గే దే లేకుండా ముందుకు వెళ్తున్నారని అది గమనించి సీఎం రేవంత్ రెడ్డి ఇంద్ర మహిళా శక్తి పథకం ద్వారా మహిళల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టారని వారన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు.
మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.
పరకాల నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా డైరీని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఇంద్ర మహిళా శక్తి సంబరాలను పొడిగించిన నేపథ్యంలో మీరు అంతా సంబరాలు జరుపుకుంటూ గత సంవత్సరం ప్రగతికి వచ్చే సంవత్సరం ఎలాంటి ప్రగతి సాధించాలనే దానిపై మీరు సంబరాలతో పాటు ప్రగతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.
సంగెం గీసుకొండ లలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్సు ఆర్టీసీ బస్సు వచ్చిందని అవి అభివృద్ధి లోకి వచ్చుటకు కృషి చేయాలన్నారు.
ఇందిరా మహిళా శక్తి పథకంలో ప్రభుత్వం నుండి ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ లో కిషోర్ బాలికలు 60 ఏళ్లు దాటిన మహిళలు దివ్యాంగుల గ్రూపులు చేయాలన్నారు.
ముఖ్యంగా సంఘం నుండి సీనియర్ సిటిజన్స్ వారి పిల్లలు చూడడం లేదని కలెక్టరేట్ కు వచ్చిదరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా వారి నిస్సహాయ స్థితిని స్వయం సహాయక సంఘాల
ద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కౌసల్యాదేవి, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, మండల సమైక్య అధ్యక్షురాలు రాధిక, మహిళా సంఘాల సభ్యులు , ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.








