Mahaa Daily Exclusive

  కేంద్ర పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించాలి బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్..!

Share

వరంగల్ మహా:

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలో హంటర్ రోడ్డు లో గల సత్యం కన్వెన్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

అనంతవరం సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందని గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకే కాదు, గ్రామీణ ప్రాంతవాసులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అని ఇదే అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని అన్నారు. అంతేకాకుండా గ్రామస్థాయి వార్డ్ మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బీజేపీ అభ్యర్థులే గెలవాలనీ, కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీజేపీ అని వారి కష్టం ఎప్పుడూ పార్టీ మర్చిపోదని ఇటీవల మోడీ సర్కార్ పేద ప్రజలకు మూడు నెలల రేషన్ బియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు, రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మోసం చేసిందని, దేశంలో మతం పేరుమీద ఓట్లు అడిగిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఎంత మంది బీసీలు ఉన్నారు? కుల గణన ప్రకారం కనీసం 8 మంత్రిత్వ పదవులు కూడా ఇంకా లేదని, మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తామని రాష్ట్రంలో వేలాది గ్రామాలకు అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది బిజెపి కేంద్ర ప్రభుత్వమేనని గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం సభ్యులు వన్నాల శ్రీరాములు, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వంగాల సమ్మిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, డాక్టర్ వన్నాల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, జిల్లా మాజీ చెప్పి వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు బండి సాంబయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు జలగం రంజిత్ రావు, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బైరి మురళి కృష్ణ, గోగికర్ అనిల్, జిల్లా, మండల పధాధికారులు, వివిధ మోర్చా జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Latest