Mahaa Daily Exclusive

  రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌ ను సందర్శించిన కేంద్ర మంత్రులు 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద పునరాభివృద్ధి..!

Share

హన్మకొండ మహా;

కేంద్ర రైల్వే, సమాచార, ప్రచార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు ప్రజా ప్రతినిధులతో కలిసి శనివారం కాజీపేట లోని రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ ను సందర్శించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన విభాగాల అధిపతులు అలాగే ఇతర సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
ఈ సంధర్భంగా అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ కాజీపేటలోని మెగా రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ దాదాపు రూ. 521 కోట్లతో అత్యాధునిక స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు సంబందించిన నిర్మాణ పనులు ఈ సంవత్సరం డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతాయని, మొత్తం ప్రాజెక్ట్ 2026 చివరి నాటికి పూర్తవుతుందని ఆయన తెలియజేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని, కోచ్‌లు, ఇంజిన్ల తో పాటు మెట్రో రైళ్లను తయారు చేయడానికి అనువైన విధంగా రూపొందించ బడిందని మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌లో పనుల పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం త్వరలో భారీ రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ రైల్వే ఉత్పత్తి ఎగుమతి దేశంగా మారుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేటలో త్వరలో ప్రారంభం కానున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం జరుగుతుందని అన్నారు. కోచ్‌లను మాత్రమే కాకుండా ఇంజిన్లను కూడా తయారు చేస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 3,000 మందికి ప్రత్యక్షంగా మరికొంత మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద పునరాభివృద్ధి చేస్తున్నామని, వీటిలో వరంగల్ అమృత్ స్టేషన్‌తో సహా 3 స్టేషన్లను ఇటీవల గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించారని తెలిపారు. ప్రధానమంత్రి, రైల్వే మంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల లో మౌలిక సదుపాయాలు అపూర్వమైన అభివృద్ధిని చూస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు, అది వందే భారత్ రైళ్లు, విద్యుదీకరణ, కొత్త రైళ్లు, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో నిర్మించ బడుతున్న స్టేషన్లు మొదలైనవి కావచ్చునని పేర్కొన్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రులు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించడం తో పాటు నిర్మాణ స్థలంలో ఉన్న భద్రతా అంశాలను కూడా పరిశీలించారు.

Latest