Mahaa Daily Exclusive

  మున్సిపల్ కార్మికులకు పెరిగిన వేతనాలు పంపిణీ ఇబ్రహీంపట్నంలో వందరోజుల కార్యచరణ ప్రణాళిక ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. శనివారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, స్వయం ఉపాధి సంఘాల మహిళలకు, స్మార్ట్ ఈషా హాస్పిటల్, సంరక్షణ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితం హెల్త్ క్యాంప్, మహిళ సంఘాల వారు స్వయంగా తయారుచేసిన వస్తువుల నిర్వహణ మేళా, ఇంకా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులకు బీపీ, షుగర్, ఇతర వ్యాధుల గూర్చి నిర్ధారించుకోవడం జరిగింది. రోగులకు మందులు కూడా హాస్పిటల్ యాజమాన్యాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికునికి ఒక కిట్ అందజేయడం జరిగింది. ఆ కిట్లో వర్షాకాలం దృశ్య రైన్ కోట్, పరిశుభ్రంగా ఉండడానికి ఆరు నెలలకు సరిపడా సబ్బులు ఇతర వస్తువులు కమిషనర్ అందించారు. అనంతరం వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రణవ్ గౌడ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, శివలింగం, మున్సిపల్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులుకు పెరిగిన వేతనాలు…
ఇబ్రహీంపట్నంలో సిఐటియు పోరాట ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచారని అన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 43 మందికి కార్మికులకు పెరిగిన వేతనం 15 వేల రూపాయలు, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి కార్మికులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మున్సిపాలిటీ కన్వీనర్ చింతపట్ల ఎల్లేశ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ కు సన్మానం చేయడం జరిగింది. ఐదు సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి కార్మికులు 15 వేల రూపాయల వేతనం సాధించుకున్నారు.

Latest