రంగారెడ్డి జిల్లా మహా:
నేడు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేయనున్న ఎమ్మెల్యే రంగారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు అమలు చేస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నేడు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సమావేశంలో పాల్గొని, నియోజకవర్గంలోని నాలుగు మండలాల, నాలుగు మున్సిపాలిటీల మహిళా సంఘాలకు, ఇందిరా మహిళా శక్తి ద్వారా వడ్డీ లేని రుణాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Post Views: 86








