కాటారం, మహా : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్గా కోట రాజబాబు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా గ్రంథాలయం కార్యాలయంలో 21 వ తేదీ ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు , రాష్ట్ర టిపీసీసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు,రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, డి సీ సి అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి లు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, మండల ప్రెసిడెంట్లు,మాజీ ఎంపీపీ లు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,డైరెక్టర్లు,చైర్మన్లు,మాజీ సర్పంచ్ లు, మహిళ,యూత్ నాయకులు,కార్యకర్తలు,ప్రజలు, మిత్రులు ప్రతి ప్రమాణ స్వీకారానికి రావాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాపు విజ్ఞప్తి చేశారు.








