వరంగల్ మహా;
ఆషాడమాసం చివరి ఆదివారం రోజున వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి గ్రామం గండి మైసమ్మ కు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో పాటు కూతురు సుస్మిత పటేల్ బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నాలుగేండ్లుగా మైసమ్మ తల్లికి బోనం సమర్పిస్తున్నామని
వంచనగిరి గ్రామస్తులతో కలిసి మైసమ్మకు బోనం సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా మొదటగా
భద్రకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తామని అనుకున్నప్పటికీ వేద పండితులతో సంప్రదింపుల తరువాతే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు, మహిళా కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు, అభినందనలు పాల్గొన్నారు.
Post Views: 123








