ఇల్లెందు , మహా.
ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న ఆర్ట్స్ గ్రూపు విద్యార్థులకు ఇల్లందులో ఉన్న వాటర్ ఫిల్టర్ బెడ్ నిర్మాణంను విద్యార్థులందరికీ క్షేత్రస్థాయిలో చూపించడం జరిగింది. ఇల్లందు చెరువు వద్ద నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఎలా చేరుతుంది ఇది బ్రిటిష్ వారు నిర్మించిన కట్టడం అని విద్యార్థులకు సీనియర్ మోస్ట్ చరిత్ర అధ్యాపకులు లక్ష్మణరావు గారు చెప్పినారు.నీరు ఎలా ఫిల్టర్ అవుతుంది అనే విషయం గురించి వివరించినారు. విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విద్యార్థులకు ఈ నిర్మాణ
మును చూపించారు.ఆ నిర్మాణం ఎదురుగా ఎదురుగా ఉన్న ఆయిల్ మిల్లును కూడా చూపించినారు. వేరుశెనగ నూనె, పొద్దుతిరుగుడు పువ్వుల నూనె, కొబ్బరి నూనె, దీపారాధన నూనె మిల్లులో ఏ విధంగా తయారు అవుతుందో చూపించారు. ఈ రెండు దృశ్యాలను చూసి విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.








