ఇల్లెందు ,మహా.
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ, రాష్ట్ర మహాసభల సందర్భంగా, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ చేయాలని, రంగాల వారీగా ఆయా అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ జిల్లా కేంద్రంలో ఈనెల 31న ప్రదర్శన ధర్నాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా ఇల్లందు సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 21-7-25 జిఎం ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు.
ఈరోజు చండ్ర కృష్ణమూర్తి (ఎల్లన్న) మెమోరియల్ ట్రస్టు భవనంలో, మూడ్ బాలు చౌహన్ అధ్యక్షతన బ్రాంచ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ బ్రాంచ్ కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి ఇల్లందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు బ్రాంచి కార్యదర్శి కొత్తపల్లి రఘు పాల్గొని మాట్లాడుతూ
సింగరేణిలో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు నేడు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు డివిజన్లోని కేఓసి సోలార్ రైల్వేసైడింగ్ జెకె సివిల్ రోడ్ క్లీనింగ్ తదితర టెండర్లను మ్యాన్ పవర్ తగ్గించి పంపడం వల్ల కార్పొరేట్ నుంచి టెండర్లు తిరిగి వస్తున్నాయి తద్వారా కార్మికులకు టెండర్ అయిపోయిందని అధికారులు చెబుతుండడం వల్ల ఈరోజు కార్మికులు ఇంతకాలం సింగరేణి మీద ఆధారపడి చాలీచాలని వేతనాలతో పనులు నిర్వహిస్తూ టెండర్లు లేక రెండు మూడు నెలల నుండి ఎక్కడ పని దొరకక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి అన్నారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకొని కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు.ఇల్లందు డివిజన్లోని లేబర్ సప్లై కాంట్రాక్టర్లకు 2014 నుండి, 2025 వరకు పాత ఎస్ ఆర్ ప్రకారం బిల్లులు చెల్లి,స్తున్నారని అన్ని రేట్లు పెరుగైయని కాంట్రాక్టర్ లేబర్ మ్యాన్యువల్ పెంచాలని వారు టెండర్లు వేయకుండా వారి యొక్క నిరసనను తెలియజేస్తున్నారని. ఇది న్యాయమైన సమస్యని వెంటనే ఈ కాంట్రాక్టు మ్యానువల్ రేట్లు పెంచే విధంగా సింగరేణి యాజమాన్యం చూడాలని అన్నారు. రేపు జరిగే జిఎం ఆఫీస్ ధర్నాను జయప్రదం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వీరన్న రామకృష్ణ శీను హమీద్, అంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు.








