ఖమ్మం, మహా.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాతబస్తీ అలియాబాద్ మేకలబండ నల్లపోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం ఎంపీ రవిచంద్ర నల్లపోచమ్మ తల్లిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ పూజారి ఎంపీ రవిచంద్రతో పాటు కూసం శ్రీనివాస్,మోహన్ రెడ్డిలను కండువాలతో సత్కరించి,ఆశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.నల్లపోచమ్మ తల్లి ఆలయ సందర్శనకు విచ్చేసిన ఎంపీ రవిచంద్రను మున్నూరుకాపు ప్రముఖులు తూడి ప్రవీణ్ కుమార్,పొన్న వెంకటరమణ తదితర ప్రముఖులు సాదర స్వాగతం పలికారు.
Post Views: 72








