Mahaa Daily Exclusive

  మల్లెపూల నర్సయ్యకు సన్మానం ..!

Share

ఆదిలాబాద్, మహా

ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన మల్లెపూల నర్సయ్య కు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి సత్కరించారు. ఆదివారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ లో పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ మల్లెపూల నర్సయ్యకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిరంతర కష్టజీవి అని ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి కి పదవి వరించిందని పేర్కొన్నారు. రెండు సార్లు జడ్పీటీసీ గా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి సేవలందించారని గుర్తు చేశారు. పార్టీ కష్ట కాలంలో అండగా నిలిచారని చెప్పారు. మంచి వ్యక్తిత్వం కలిగిన నర్సయ్య పదవికి వంద శాతం వన్నె తీసుకొస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, డీసిసిబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Latest