తలమడుగు మహా న్యూస్:
తెలంగాణ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ (టిపిడిఏ) అదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని నిర్మల్ జిల్లాలోని ఆదివారం రోజు ఓ ఫంక్షన్ హాల్ లో,అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల మరియు డివిజన్ కార్యవర్గాలను టీపీడీఈఏ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇంద్రసేన రెడ్డి ప్రధాన కార్యదర్శి నాల్ర సుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రధాన అధికారులు గోవర్ధన్ రెడ్డి నరేందర్ ల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. నూతన కమిటీలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా గోవర్ధన సతీష్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శిగా గన్ను జనార్దన్ రెడ్డి కోశాధికారిగా భూ షణవేణి వెంకటేష్,అదిలాబాద్ డివిజన్ కార్యదర్శిగా కొమ్మటి మోహన్ ప్రసాద్, కోశాధికారిగా వినయ్ కుమార్ , ఉట్నూర్ కార్యదర్శిగా జాదవ్ రోహిదాస్ కార్యదర్శిగా రాథోడ్ పృథ్వీరాజ్ ఎం ఆర్ టి ఆదిలాబాద్ కార్యదర్శిగా షిండే సాయికిరణ్ కోశాధికారిగా సుశాంత్, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా కాటం తిరుపతి రెడ్డి జిల్లా సలహాదారుడిగా దేవుళ్ళ శ్రీనివాస్, మహిళా ప్రతినిధిగా శ్రీమతి గోమాస అలివేణి, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను నెరవేరుస్తూ వినియోగదారులకు సత్వర సేవలను అందించుటకు పాటు పడతామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో టిపిడిఏ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








