భూపాలపల్లి , మహా :
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.సోమవారం గణపురం మండలం, చెల్పూర్ లో 5.50 కోట్లు కెటిపిపి సీఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన బస్ స్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మనం చేపట్టే మంచి కార్యక్రమాలకు ఎపుడు దేవుని ఆశీస్సులు ఉంటాయని, అన్ని వేళలా సహకరిస్తారని తెలిపారు.
ఈ ప్రాంతం సస్య శ్యామలం గా ఉండాలని ప్రభుత్వం ఎల్లపుడు ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.
దివంగత నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలని సంకల్పించారని, ఈ ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని, మహిళలకు మహిళా శక్తి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్ టి సి బస్సులు, పెట్రోల్ బంక్ లు , సోలార్ పవర్ కేంద్రాలు, దాన్యం సేకరణ కేంద్రాలు, మహిళా క్యాంటీన్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలు లాంటి కార్యక్రమాలు ఆడబిడ్డలను ముందు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్న 10 నెలలో 21 వేల కోట్లు రుణమాఫీ చేశామని, రైతు భరోసా 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, 500లకు గ్యాస్ సిలిండర్, పేదలకు మెరుగైన వైద్యసేవలకు 10 లక్షలు ఆరోగ్య శ్రీ ఇస్తున్నామని తెలిపారు. 5 లక్షల కొత్త రేషన్ కార్డు లతో పాటు 16 లక్షల కొత్త పేర్లను పాత కార్డులలో నమోదు చేశామని తెలిపారు ఎం
ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షలు ఇస్తున్నామని, భూపాలపల్లి నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇళ్లు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో అదనంగా 1500 ఇళ్లు ఇస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద వారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.
ప్రతి సోమవారంఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు 3 సార్లు ఓడిపోయిన ప్రజల మన్ననలు పొంది నాలుగో సారి అత్యధిక మెజారిటీతో గెలిచారని, ఓడిపోతే ప్రజలను ఒదిలేసే వాడు నాయకుడు కాదు, ఓడినా గెలిచినా ప్రజల వెన్నంటి ఉండే వాడు అసలైన నాయకుడని అభినందించారు. నియోజక వర్గంలో గత ప్రభుత్వం హయంలో వరదలు సంభవించి నష్టం జరిగితే అది పూడ్చడానికి కాలుకు బలపం కట్టుకుని మరి అన్ని శాఖల మంత్రుల దగ్గరికి తిరిగి నియోజక వర్గం అభివృద్ధికి నిద్ర హారాలు మాని కృషి చేస్తున్నారన్నారు. కర్ణాల కుంట 180 ఎకరాల సమస్యను పరిష్కరిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల విడతల వారిగా ప్రతి ఒక్కరికి ఇస్తామని పేర్కొన్నారు. సత్తన్న ను ఎలా గెలిపించి ప్రభుత్వాన్ని నిలబెట్టారో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ ప్రభుత్వానికి మీ అస్సీస్సులు, గెలిపించాల్సిన బాధ్యత.
మీపై ఉందని తెలిపారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
సంవత్సరం కాలం నుండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండు కళ్ళుగా భావించి నడిపిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ యాయంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కొరకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారని అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 15 వేల రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేశామని, 5వేల నూతన రేషన్ కార్డులు మంజూరు చేసామని తెలిపారు. నిరుపేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని తెలిపారు. చెల్పూర్ లో 5 కోట్ల 50 లక్షలు తో లక్షల కే టి పి సి ఎస్ ఆర్ నిధులతో బస్టాండ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల విద్యకు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గణపురంలో 60 ఎకరాలలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేశామని మహిళలకు మినీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయటం కొరకు 20 ఎకరాల కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తుందని సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలు ఎదగాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ఉచిత విద్యుత్ గ్యాస్ వివరించారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ గోరి కొత్తపల్లి, టేకుమట్లలో 6 కొట్లతో ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గోరి కొత్తపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందల సంవత్సరాలు నుండి నియోజక వర్గంలో భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారని వారందరికీ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. భూ భారతి చట్టంతో 12 సంవత్సరాలు మోకాపై ఉంటే పట్టాలు జారీ చేయు విధముగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అనునిత్యం పని చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు బై పాస్ రోడ్డు, మైనింగ్ కళాశాల, పాలి టెక్నీక్ కళాశాల, డిబిఎం 38 కాలువకు 320 కోట్లు మంజూరు చేయాలని సూచించారు. దీని వల్ల 44700 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్టీసీ ఎడ్ సలోమం, ఆర్ ఎం విజయ భాను, డిఎం ఇందు,
సింగిల్ విండో చైర్మన్లు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు కిష్టప్ప, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.








