రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడికి వ్యతిరేకంగా ఈనెల 23న చేవెళ్ల డివిజన్ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుందని అరుణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం, స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ కోసం సమగ్ర చట్టం చేయాలని తదితర డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బందు జరగబోతుందని దీనికి విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.








