Mahaa Daily Exclusive

  జిల్లా లో 25వ తేదీ నుండి రేషన్ కార్డుల పంపిణీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

Share

కాటారం, మహా :

భూపాలపల్లి జిల్లాలోని రెండు నియోజక వర్గాలలో రేషన్ కార్డు పంపిణీ పై సమావేశం నిర్వహించి ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ,
పౌర సరఫరాలు, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుండి 10వ తేది వరకు రేషన్ కార్డులు పంపిణీకి అన్ని మండలాల వారిగా షెడ్యూల్ తయారు చేయాలని ఆదేశించారు.
మంగళవారం నానో యూరియా గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తన దుకాణాలాల్లో తప్పని సరిగా స్టాకు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనవు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి బాబు, ఇరిగేషన్ ఈఈలు తిరుపతిరావు, ప్రసాదు, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest