Mahaa Daily Exclusive

  కడప జైలులో ఐదుగురు జైలు సిబ్బంది సస్పెండ్..!

Share

కడప జిల్లా కేంద్ర కారాగారంలో ఐదుగురు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తోపాటు ముగ్గురు వార్డర్లను జైళ్ల శాఖ డీజీ సస్పెండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్‌ఫోన్లు అందించారన్న ఆరోపణల నేపథ్యంలో, డీఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు విచారణ జరిపారు. అనంతరం నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.

Latest