Mahaa Daily Exclusive

  బాలికలకు పోలీస్ శాఖ ద్వారా కరాటే శిక్షణ..!

Share

తలమడుగు మహా న్యూస్:
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాలికల కోసం జ్వాల అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తలమడుగు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల పోలీస్ శాఖ ద్వారా మంగళవారం బాలికలకు కరాటే శిక్షణ కార్యక్రమాన్ని ఎస్సై రాధిక ప్రారంభించడం జరిగింది. వారు మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా జ్వాల కార్యక్రమంలో భాగంగా 10 రోజులపాటు కరాటే శిక్షణ ఇవ్వబోతున్నామని అన్నారు. బాలికలకు ఆత్మస్థైర్యం, మనోధైర్యం, తనను తాను రక్షించుకోవడం ఎలాగో దుండగులపై దాడి ఎలా చేయాలో మొదలైన నైపుణ్యాలు కరాటేలో నేర్పబడతాయని దీనిని బాలికలంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకట్ రావు, ఉపాధ్యాయులు వినోద్ రెడ్డి, చంద్రమ్మ, వెంకటేశ్వర్, మురళీధర్, రాజేందర్, రాకేష్, రవీందర్ కుమార్, స్వప్న, నరసయ్య, పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Latest