Mahaa Daily Exclusive

  తలమడుగులో గోరింటాకు పండగ..!

Share

తలమడుగు మహా న్యూస్:
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోరింటాకు పండగను వైభవంగా మహిళల భక్తులు జరుపుకున్నారు. వారు మాట్లాడుతూ ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అతి పురాతన కాలం నుంచి వస్తుందని దీనిని ఆషాడ మాసంలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల వాతావరణం చల్లగా మారుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి, వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరం చల్లబడి, అనారోగ్య సమస్యలు రాకుండా రక్షణల నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం బయట దొరుకుతున్న కోన్స్ ద్వారా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి గౌరీ మాతకు ఎంతో ఇష్టమైన ప్రకృతి ద్వారా లభించే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ ఆషాడ మాసంలో స్త్రీలకు ఆరోగ్యంతో పాటు అలంకారణంగా చేతులకు అందని తెస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, రామ్ రెడ్డి, మహిళా భక్తులు సునీత రెడ్డి, ఉదయశ్రీ, నవీన, సురేఖ రెడ్డి, నందిని, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest