Mahaa Daily Exclusive

  ఆధునిక సాంకేతికతో మెరుగైన సేవలు ..!

Share

ఆదిలాబాద్, మహా

రాష్ట్రంలో తపాల సేవలను మెరుగ్గా అందించేందుకు ఆధునిక సాంకేతికత (ఐ టీ 2.0)ను ప్రారంభిస్తున్నామని తపాల శాఖ ఆదిలాబాద్ జిల్లా పర్యవేక్షకుడు బోరెడ్డి గుంప స్వామి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కార్యాలయం లో సేవలను ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ కొత్త సాంకేతికతతో మెరుగైన సేవలు లభిస్తాయని వివరించారు. వినియోగదారులు ఇంటి వద్ద ఉండి ఉత్తరాలు బుక్ చేసుకోవచన్నారు. భవిష్యత్తు లో కాగితాలు వాడకుండా కార్యాలయం కార్యకలాపాలు ఉంటాయని వివరించారు. ఈ నూతన విధానంతో ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో కిరణ్ జాదవ్,రాజు, నాగిరెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Latest