Mahaa Daily Exclusive

  అచ్యుతానందన్ ఆశయాల సాధన కోసం అంకితం అవ్వాలి సీపీఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి..!

Share

ఆదిలాబాద్, మహా

కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు విఎస్ అచ్యుతానందన్ సంస్మరణ సభను సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రి ,పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడారు. అచ్యుతానందన్ సేవలను కొనియాడారు . 102 సంవత్సరాల వయస్సులో అచ్యుతానందన్ అనారోగ్యంతో మరణించారని తెలిపారు.ఆయన మరణం ప్రజాఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. పేద కుటుంబం నుండి వచ్చిన పేదరిక నిర్మూలన కోసం పోరాడారని గుర్తు చేశారు. కేరళ రాష్ట్రాన్ని దేశంలోనే ఆధునిక రాష్ట్ర స్థాయి కీ తీసుకెళ్లారని కొనియాడారు. విద్యా ,వైద్య రంగంలో కేరళను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు పాలయ్యారని పున్న ప్రవాయిలర్ ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొన్నారని వివరించారు. ట్రావెన్ కోర్ సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు. సోషలిజం ద్వారానే సమసమాజం సాధ్యం అని నమ్మారని, అయన ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ శ్రేణులు అంకితం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నమొల్ల కిరణ్ , జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న , ఆర్ .మంజూల , నాయకులు కే .ఆశన్న ,పండుగ పొచ్చన్న , గంగాసాగర్ ,అరీఫా బేగం తదితరులు పాల్గొన్నారు .

Latest