Mahaa Daily Exclusive

  పన్ను వసూళ్లలో నిర్లక్ష్యాన్ని వీడండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

Share

వరంగల్ మహా;

పన్ను వసూళ్లలో నిర్లక్ష్యాన్ని విడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కమిషనర్ చాంబర్ లో పన్ను వసూళ్ల పురోగతిపై రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ ఐ ల వారిగా పన్ను వసూళ్ల పురోగతినీ సమీక్షించిన అనంతరం కమీషనర్ మాట్లాడుతూ అనుకున్న స్థాయిలో పన్ను వసూళ్లు జరగడంలేదని గత సమావేశం తో పోల్చితే పన్ను వసూళ్లలో పురోగతి కనిపించడం లేదని ఆర్ ఐ ల వారిగా ఇప్పటి వరకు చేసిన పన్ను వసూళ్ల శాతం తో పాటు పి టి ఐ వసూళ్లను కమిషనర్ సమీక్షించి వసూళ్ల తీరు పై అసహనం వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు (ఆర్ ఓ)లు క్షేత్రస్థాయిలో పర్యటించి పన్ను వసూళ్ల వృద్ధి ఎందుకు జరగడం లేదో పరిశీలించాలన్నారు బిల్ కలెక్టర్లు కేవలం పన్ను వసూళ్ల కోసం మాత్రమే పని చేస్తున్నారని అయినప్పటికి పన్ను వసూళ్లలో అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదని కమిషనర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి రవీందర్ పన్నుల అధికారి రామకృష్ణ ఆర్ ఓ లు షహజాది బేగం యూసుఫోద్దీన్ శ్రీనివాస్ ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.

Latest