Mahaa Daily Exclusive

  కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన మేయర్, కమీషనర్ ఐసిసిసి కేంద్రం నుండి వాహనాలను నియంత్రించేలా చర్యలు..!

Share

వరంగల్ మహా;

బల్దియా ప్రధాన కార్యాలయంలో గల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐ సి సి సి)ను నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
మంగళవారం క్షేత్ర స్థాయి లో సందర్శించి నిర్వహణ తీరును అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకోని సమర్థవంతం గా నిర్వహించుటకు అధికారులకు తగు సూచన లు చేశారు. ఈ కార్యక్రమం లో సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి, ఇంచార్జి ఎస్ ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఈ ఈ లు రవికుమార్ మాధవి లత డి ఈ లు రాజ్ కుమార్ రాగి శ్రీకాంత్ ఐ టి మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కమిషనర్ తో మేయర్ కలిసి ఐసిసిసి కేంద్ర సందర్శన

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐ సి సి సి) నుండి వాహనాలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అన్నారు.
మంగళ వారం బల్దియా ప్రధాన కార్యాలయం లో గల ఐసిసిసి కేంద్రాన్ని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి సందర్శించి సి సి కెమెరా ల పని తీరు, సి అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకొని సమర్థవంతం చేపట్టుటకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ బల్దియా కు చెందిన జే సి బి లు డోజర్లు, చెత్త తరలింపు ట్రాక్టర్ల కదలికలను ఐసిసిసి కేంద్రం నుండే మానిటరింగ్ చేసేలా ఉండాలని, ఆ రోజు పని చేయని వాహనాల సమాచారం అందేలా ఏర్పాట్లు ఉండాలని, ఇండోర్ తరహా లో మానిటరింగ్ వ్యవస్థ కొనసాగాలని, చెత్త తరలింపు వాహన సమాచారం ఎప్పటికపుడు సానిటరీ ఇన్స్పెక్టర్ లు జవాన్ లకు చేరాలని చూడాలన్నారు. స్వచ్చ ఆటో లకు బయో ఫెన్సింగ్ లాగింగ్ ఉండాలని ఇందుకోసం శానిటేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగాలు సమన్వయం తో యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని తెలిపారు. వాహనాలకు సంబంధించిన ట్రాకింగ్ సమాచారాన్ని వెంటనే అప్ డేట్ చేయాలని, గ్రీవెన్స్, కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ కు వచ్చే ఫిర్యాదులు ఐసిసిసి కు చేరేలా మాడ్యూల్ ఏర్పాటు, ప్రతి సెన్సార్ కు ట్రాకింగ్ ఏర్పాటు ఉండేలా చూడాలని, వాహన నియంత్రణ ను బయో మెట్రిక్ కు అనుసంధానం,
సంబంధిత సమాచారం అందుబాటులో ఉండాలని, డి ఆర్ సి సి కేంద్రాలు పార్కుల లో ఏర్పాటు చేసిన కెమెరాలు పనిచేస్తున్నాయా? లేవా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఫిల్టర్ బెడ్ లతో పాటు నగర వ్యాప్తం గా ఉన్న 125 వాటర్ ట్యాంక్ లలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసి ఐ సి సి సి కి అనుసంధానం చేయాలని, జీ ఐ ఎస్ ను అప్ డేట్ చేయాలని, ఐ సి సి సి కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మాన్యువల్ గా అందుబాటు లో ఉండాలని అన్నారు. బల్దియా బాల సముద్రం లో నిర్వహిస్తున్న వెహికల్ షెడ్డు తో పాటు ట్రాన్స్ఫర్ స్టేషన్ ప్రాంతాల్లో సి సి కెమెరా లు ఏర్పాటు చేయాలని, సి సి కెమెరా ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ కు సంబంధించి వాహనాలు నిర్దేశిత మార్గంలోనే ప్రయాణిస్తున్నాయా లేదో పరిశీలించాలని, గమ్యం మారితే సరియైన విధం గా గైడ్ చేయాలని మేయర్ తెలిపారు.

గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐదు డిజిటల్ డిస్ప్లే బోర్డ్ లలో రోజువారీ
వాతావరణ సమాచారం, ఏదైనా సమస్యల వల్ల నీటి సరఫరా అంతరాయం జరిగే ప్రాంత వివరాలు ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ మహేందర్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఈ ఈ లు రవికుమార్ మాధవి లత డి ఈ లు రాజ్ కుమార్ రాగి శ్రీకాంత్ ఐ టి మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest