వరంగల్ మహా;
కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదలకు నిలువ నీడ లేకుండా ఇంటి స్థలాలు పట్టాలు కనీస సదుపాయాలు కల్పించరా అని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ప్రశ్నించారు. పేదలకు ఎన్నికల హామీలను వర్తింపజేసి అమలు చేయకపోతే ఉదృతమైన ప్రజా పోరాటం తప్పవని హెచ్చరించారు. మంగళవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య)-ఎం సి పి ఐ (యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వందలాదిమంది పేదలు తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు, ఆటపాటలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గాదగోని రవి మాట్లాడుతూ అట్టడుగు వర్గాన ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేవలం కొద్ది మంది ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని గత ప్రభుత్వ వైఫల్యాలను సాకుగా చూపించి ఇచ్చిన హామీలను విస్మరిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన నేటికీ ఏ ఒక్క పేదవాడికి ఇంటి స్థలం పట్టాలు ఇవ్వకపోవడమే ఎందుకు నిదర్శనం అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప అసలైన పేదవారికి మంజూరి ఇవ్వటం లేదన్నారు. పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను రక్షించి పట్టాలు ఇవ్వాల్సింది పోయి కబ్జాదారులకు వoత పడుతూ పేదలను ఖాళీ చేయించి కుట్ర పనుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు రోడ్లు డ్రైనేజీ కరెంటు ఇంటి నెంబర్లు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాలోతు సాగర్, ముక్కెర రామస్వామి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగల రాగసుధ లు మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో పదివేల మంది పేదలు అనేక సంవత్సరాల క్రితం నుండి ప్రభుత్వ భూములను రక్షించి గుడిసెలు వేసుకుని తలదాచుకుంటున్నారని అలాంటి వారికి ఇంటి పట్టాలు ఇండ్లు కనీస సౌకర్యాలు కల్పించకుండా గత ప్రభుత్వములే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని వరంగల్ నగర పరిధిలోని జక్కలొద్దీ లెనిన్ నగర్ బెస్తం చెరువు నానిమియా తోట రాజీవ్ గృహకల్ప మైసయ్య నగర్ పిఏ నగర్ ఓంకార్ నగర్ ఆర్ఎస్ నగర్ ఓఎస్ నగర్ సుందరయ్య నగర్ ఎమ్ఎచ్ నగర్, నర్సంపేట పట్టణంలోని జ్యోతి బస్ నగర్ కారల్ మార్క్స్ కాలనీ తదితర కాలనీలను తక్షణమే అధికార యంత్రాంగo సందర్శించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని లేకపోతే పేదలందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం కేటాయించే ఇందిరమ్మ ఇండ్లలో గుడిసె వాసులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.
అనంతరం ప్రతినిధి బృందం కలెక్టర్ కార్యాలయ ప్రతినిధికి సమస్యలతో కూడిన మెమొరాండాన్ని ఇచ్చి వారి హామీ తో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గోనె కుమారస్వామి నర్ర ప్రతాప్ మంద రవి నాగేల్లి కొమురయ్య యూపీఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్ మహిళ సంఘం జిల్లా కార్యదర్శులు కనకం సంధ్య జిల్లా నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.








