Mahaa Daily Exclusive

  కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.మాజీ ఏమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ..!

Share

భూపాలపల్లి , మహా :

కాలేశ్వరం పథకం పంప్ సెట్లు ఆన్ చేసి కర్రీ పంటకు నీటిని విడుదల చేయాలని మా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం భూపాలపల్లి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని అన్నారు.
జిల్లాలకు మంత్రులు వస్తున్నారు పొతున్నారు మంత్రులు అంటే ప్రభుత్వాని నడిపించేవారు,ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగా సేద్యం చేసే భూపాలపల్లి జిల్లా లో ఏరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.

27 వ తేదీన ఇస్సిపేట కు కే టి ఆర్ రాక

ఈనెల 27వ తేదీన భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్ళపల్లి మండలం,ఇస్సిపేట గ్రామ మాజీ సర్పంచ్ కీ.శే కొడారి కోమురయ్య విగ్రహ ఆవిష్కరణ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పర్యటన విజయవంతం చేయాలని గండ్ర తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు జిల్లాల్లో ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తు చేయకపోవడంతో కొన్ని వేల క్యూసెక్కుల నీళ్లు సముద్ర గర్భంలో కలిసి పోతున్నాయి.ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
భూపాలపల్లి లో నివసించే వారు వివిధ ప్రాంతాల నుండి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు ఎక్కువ. ఇక్కడ ఇళ్ళు నిర్మించుకోవడానికి ఇంటి స్థలం అర్హులైన లబ్దిదారులకు బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా డబుల్ బెడ్ రూమ్ లబ్ది దారులను అందరి సమక్షంలో అధికారుల మధ్యలో డ్రా పద్దతిలో ఎంపిక చేసినట్లు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ లబ్ది దారుల లిస్ట్ మార్చి అంతా దళారీ వ్యవస్థను నడిపిస్తున్నారని ఆరోపించారు.
మీడియా మిత్రులకు గతంలో మేము ఇచ్చిన ఇళ్ళ పట్టాలను వెంటనే జర్నలిస్ట్ సోదరులకు కేటాయించాలని,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి డిమాండ్ చేశారు.కేటీఆర్ పర్యటన సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

Latest