భూపాలపల్లి, మహా :
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రజల సైంటిస్టు,
మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం పదవ వర్ధంతిని పురస్కరించుకొని ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోనీ ఎనిమిదవ తరగతి చదువుతున్న అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు భూపాలపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాల లో నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి మండల విద్యాశాఖ అధికారి అజ్మీర దేవా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భూగోళము వాతావరణ పరిస్థితులు మానవ నివాసయోగ్యం లేకుండా పెను మార్పులకు గురవుతున్నదని అన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు సేంద్రియ విధానంలో వ్యవసాయం ఎలా చేయాలి, ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించడానికి తగు చర్యలు తీసుకునే విధంగా తల్లిదండ్రుల కు మీరు చదివిన విషయాలను తెలియజేయాలని కోరారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా ప్రతి ఇంట్లో రెండు చెట్లు నాటి వాతావరణ సమతుల్యతను కాపాడాలని, కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా కృషి చేయాలని, సౌర విద్యుత్తును తయారీలో విద్యార్థులు పోటీ పడాలని, కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ రవాణా సాధనాలను వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలు ఐక్యంగా ఉండాలని సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉండాలని ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను గుర్తెరిగి దేశాభివృద్ధికి పాటుపడాలని లీడ్ గ్లోబల్ ఫౌండేషన్ కన్వీనర్ కుసుమ కృష్ణమోహన్ ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం బహుమతులు పొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ప్రథమ బహుమతి మహమ్మద్ ఉమ్మెయుజుమ్మా సన్ వ్యాలి హై స్కూల్ భూపాలపల్లి ద్వితీయ బహుమతి జే. ప్రశాంత మాధురిమ బాలాజీ ఇంటిగ్రేటెడ్ పాఠశాల భూపాలపల్లి తృతీయ బహుమతి బి రియా మన్విత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూపాలపల్లి. విజేతలైన విద్యార్థులకు డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి 27వ తేదీ ఆదివారం నాడు బాలవికాస, ఫాతిమా నగర్, కాజీపేట లో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు & బహుమతులు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, అతిధులచే అందజేయబడతాయని , భూపాలపల్లి జిల్లా లీడ్ గ్లోబల్ ఫౌండేషన్ సమన్వయకర్త కుసుమ కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.








