వరంగల్ మహా;
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత మూడు సంవత్సరాల్లో 4668 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు ద్వారా 1472 మంది రైతులు లబ్ది పొందరని,
2024-25 సంవత్సరంలో 780 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగిందని, నిర్ధేశిత లక్ష్యం మేరకు వెయ్యి ఎకరాలకు సాగు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ చేయాలని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి కనబర్చే రైతుల నుంచి త్వరితగతిన మొక్కలకు, డ్రిప్‌కు డీడీలు కట్టించాలని అన్నారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన రైతుకు సబ్సిడీ అందేలా చూడాలని, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. యూరియా పంపిణీ ప్రణాళిక బద్దంగా జరగాలని, కొరత సంబంధించి ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిన వెంటనే సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డీహెచ్‌ఎస్‌ఓ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డిసి ఓ నీరజ, డిఆర్డీఓ కౌసల్యాదేవి, వ్యవసాయ, ఉద్యనవనాల శాఖల మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








