Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ ప్రభుత్వంలో కాజీపేట అన్ని రంగాల్లో అభివృద్ధి..!

Share

హన్మకొండ మహా;

కాజీపేట సోమిడి జంక్షన్ లో రూ.2 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న కాజీపేట నుంచి సోమిడి వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేం అధికారం లోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం అంతా అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. రెండు డివిజన్ నడుమ ఉండే ప్రధాన రహదారి కావడంతో ప్రజా రవాణాకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో కాజీపేట్ నుంచి సోమీడి వరకు రోడ్డు పనులను చేపట్టామని అన్నారు.గతంలో కొంత మేరకు జరిగిన పనులను ఇప్పుడు పూర్తి స్థాయిలో చేపట్టామని తెలిపారు.నగర అభివృద్ధిలో కార్పొరేషన్, కుడా సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సోమిడి జంక్షన్ అభివృద్ధికి రానున్న రోజుల్లో నిధులు కేటాయించి సుందరికరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ విజయ శ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్ అశోక్, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు సంతోష్ స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.

Latest