Mahaa Daily Exclusive

  తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు. 15 గేట్లు ఎత్తి నీటి విడుదల…!

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని చర్ల మండలంలో తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. గోదావరి ఉపనదుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం పెరిగింది.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు 15 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి, సుమారు 28,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీరు నిల్వకావడంతో, వరదనీటి ఉద్ధృతిని తగ్గించేందుకు నీటి విడుదల కొనసాగుతోంది.
కురిసే వర్షాల ఆధారంగా మరింత వరద వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Latest