కూసుమంచి, మహా:
ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండగా, మంగళవారం మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్ని జలమయమైయ్యాయి. వీధుల్లో భారీగా వరద నీరు పొంగిపోర్లుతున్నాయి. చాలా గ్రామాల్లో చాలా ఇండ్లలోకి నీళ్ళు వచ్చి చేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.చాలా రోజుల తరువాత వరద చెరువులకు చేరింది. కొత్త నీరు, పాత నీరు చేరింది. చెరువులు, కుంటలు కొత్త నీరుతో కళకలలాడుతున్నాయి.
== కూసుమంచి మండలంలో పంటలను ముంచేత్తిన వర్షం..
కూసుమంచి మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి పంట పోలాలను వరద ముంచేత్తింది. రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి భారీగా వరదలు రావడంతో పంటపొలాలు వరద తాకిడి గురైయ్యాయి. పత్తి చేలల్లో వరద ముంచెత్తింది. భారీగా వరద నీరు దిగువకు ప్రవహించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి పంట కొంత ఎర్రబారి అవకాశం ఉంది.
== రహాదారులపై ప్రవహిస్తున్న వరద నీరు..
ఖమ్మం రూరల్ మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారు మూడు గంటల పాటు విరామం లేకుండా వర్షం కురవడంతో రహదారులపై కి వరదనీరు వచ్చింది. ముఖ్యంగా తల్లంపాడు. గ్రామంలోని నేషనల్ హైవే పక్క రోడ్డుపైకి భారీగా వరద నీరు రావడంతో ఖమ్మం నుంచి కూసుమంచి వైపుకు రాకపోకలు చేసే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ముద్దులపల్లి గ్రామంలో ప్రధాన రహదారి ఒక వైపు నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.








