Mahaa Daily Exclusive

  ఫోటోరైట్అప్.మల్లన్నపాలెంలో పిహెచ్సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన దృశ్యం. వైద్య శిబిరాలు వినియోగించుకోవాలి. పిహెచ్సి వైద్యాధికారి అంకం అరుణాదేవి…!

Share

ముదిగొండ జూలై 22 మహా:

సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని పిహెచ్సి వైద్యాధికారి అంకం అరుణాదేవి అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి కళావతిబాయి ఆదేశాల మేరకు మండలపరిధిలో పండ్రేగుపల్లి తండా,మల్లన్నపాలెం,ధనియాల గూడెం గ్రామాలలో పిహెచ్సి ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరాలు నిర్వహించారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడారు.గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఇంటి ఆవరణంలో, ఇండ్ల మధ్య,నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.దోమల వ్యాప్తి నివారణకు ఇండ్లల్లోనే తలుపులు,కిటికీలు,మూసి వేసుకొని దోమతెరలు కప్పుకోవాలని ఆమె సూచించారు. సీజనల్గా వచ్చే డెంగ్యూ,మలేరియా,చికెన్ గున్యా రోగాల నిర్మూలనకు ప్రజలు ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు.అనంతరం పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల అందజేశారు.థైరాడ్,విటమిన్ పరీక్షలు అవసరం ఉన్నవారికి 102 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈకార్యక్రమంలో సిహెచ్ఓ మధుసూదన్ రావు,ల్యాబ్ టెక్నీషియన్ రెడ్డిబోయిన రామారావు,సూపర్వైజర్ లత, పీహెచ్ఎన్ రాణి,ఎమ్ఎల్హెచ్పిలు పి ప్రవీణ్ ఆలకుంట దేవేందర్,ఏఎన్ఎంలు నీలావతి,పి హేమలత,కృష్ణమణి,రత్నకుమారి,పద్మావతి ఆశ వర్కర్లు పాల్గొన్నారు

Latest