ముదిగొండ జూలై 22 మహా
మండల వ్యాప్తంగా రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ సునీతాఎలిజబెత్ సూచించారు. ముదిగొండ నుండి యడవల్లి లక్ష్మీపురం వెళ్ళే మార్గం మధ్యలో ఊట వాగును మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో సందర్శించారు.ఈసందర్భంగా వరద ముంపుకు పొలాల నుంచి వచ్చే ఊట వాగు ఆమె పరిశీలించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ వర్షాలు పెరిగినందున గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.వాగులు ఉదృతంగా ప్రవహిస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతాయని ప్రజానీకం ప్రశాంతంగా ఉండాలని,ప్రజలు ఎవరైనా అత్యవసరం అయితే తప్ప,ప్రయాణాలు చేయవద్దని ఆమె కోరారు.వారి వెంట జూనియర్ అసిస్టెంట్లు అబ్బాస్,మేడి కర్ణ ఉన్నారు.
Post Views: 46








