Mahaa Daily Exclusive

  జాతీయ రహదారిపై పడిన.వర్షపు నీళ్లతో నీట మునిగిన పత్తి చేలు.నేషనల్ హైవే కాంట్రాక్టర్ నిర్వాకం,పత్తి చేలకు ప్రాణగండం. ఇరిగేషన్ అధికారులు తప్పిదం….!

Share

ముదిగొండ జూలై 22 మహా:

జాతీయ రహదారిపై పడిన వర్షపు నీళ్లు పత్తి చేలకు చేరి నీట మునిగి కాంట్రాక్టర్ నిర్వాకం,ఇరిగేషన్ అధికారుల తప్పిదం తో,పత్తి చేలకు ప్రాణగండంగా మారిన వైనం మండలపరిధిలో వెంకటాపురంలో మంగళవారం జరిగింది.బాధిత రైతు వివరాల ప్రకారం….. వెంకటాపురం గ్రామానికి చెందిన కందుల భాస్కరరావు ఖరీఫ్ సీజన్లో జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ఆరు ఎకరాలు,కౌలుకి తీసుకొని పత్తి పంట సాగు చేశారు.సోమ,మంగళవారాల్లో భారీగా కురిసిన వర్షంతో జాతీయ రహదారి పడిన వర్షపు వరద రోడ్డు ఆనుకొని ఉన్న పత్తి చేలోకి చేరి ఐదు ఎకరాలు నీట మునిగిందని,రైతు లబోదిబోమంటున్నాడు.గ్రామ సమీపాన ఎన్ఎస్పి కాలువ వద్ద నేషనల్ హైవే కాంట్రాక్టర్ నిర్మాణం చేసిన 24వ బ్రిడ్జికు యూటీ ఏర్పాటు చేసి నీళ్లు వెళ్లకుండా మూసివేయడంతో రహదారిపై పడిన వర్షపు నీళ్లన్నీ పత్తి పంటలోకి వస్తున్నాయని రైతు భాస్కరరావు ఆందోళన వ్యక్తం చేశారు.వర్షపు నీళ్లన్నీ పత్తి చేలో చేరటంతో పంట మునిగి దెబ్బతింటుందని రైతు భాస్కరరావు వాపోయారు. మరోపక్క రైతుల వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు గ్రామ సమీపన అండర్పాస్ ఇచ్చి అండర్పాస్ మొత్తం జలమయం చేసి,రైతుల పొలాలకు వెళ్లకుండా చేశారని ఆయన అక్రందన చెందారు.జాతీయ రహదారి నిర్మాణం ఈప్రాంత రైతులకు ఇబ్బంది తెచ్చి పెట్టిందని రైతు తెలిపారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్ బ్రిడ్జి వద్ద మూసివేసి ఉన్న యూటీని ఓపెన్ చేస్తే రోడ్డుమీద పడిన వర్షపు నీళ్లన్నీ బయటికి వెళ్లిపోతాయని రైతు చెప్పారు.ఇరిగేషన్ అధికారులు,జాతీయ రహదారి కాంట్రాక్టర్,ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేసి నేషనల్ హైవే పడిన వర్షపు నీళ్లను బయటికి వెళ్లేందుకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
లేనియెడల,ఈప్రాంత రైతుల పంట పొలాలన్నీ వర్షపు నీళ్లతో మునిగిపోతాయని రైతు భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు,ఆర్అండ్బి,ఎన్ఎస్పి ఉన్నతాధికారులు చొరవ తీసుకొని జాతీయ రహదారిపై పడిన వర్షపు నీళ్లను పంట పొలాల్లోకి వెళ్లకుండా చేయాలని,లేకపోతే రైతులందరూ రోడ్డెక్కుతామని రైతు భాస్కరరావు పేర్కొన్నారు.

Latest