ఖమ్మం,మహా.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియుడబ్ల్యుజె-ఐజెయు) జిల్లా మహాసభలు ఈనెల 24న వైరా పట్టణంలో జరుగుతున్నాయని ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులంతా పాల్గొన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు ఒక ప్రకటనలో కోరారు.ఈ మహాసభకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్,రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎంపిలు,ఎమ్మెల్యేలు,జిల్లా కలెక్టర్ దురిశేట్టి అనుదిప్,జిల్లా పోలీస్ కమీషనర్ సునీల్ దత్, టియుడబ్ల్యుజె (ఐజెయు ) రాష్ట్ర అధ్యక్షులు వీరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె రాంనారాయణ ఇతర జాతీయ,రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వారు తెలిపారు.ఈ సభకు వైరాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కోన్నారు.మంగళవారం వైరాలో శభరి గార్డెన్ లో సభవేధికను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశేట్టి, జిల్లా పోలీస్ కమీషనర్ సునీల్ దత్ ను కలిసి వారిరువురిని విశిష్ట అతిధులుగా ఆహ్వానించడం జరిగిందన్నారు.అదేవిధంగా జిల్లా సమాచార ,పౌరసంబంధాల శాఖ అధికారి ఎండి గౌస్ అలీని కూడా అతిధిగా ఆహ్వానించామన్నారు.గడిచిన ఆరవై ఏళ్ళ నుంచి జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం పోరాడుతున్న ఐజెయు మహాసభల్లో జర్నలిస్టులంతా పాల్గొన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ రావు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ సామినేని మురారీ,రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు నర్వనేని వెంకట్రావ్,సీనియర్ జర్నలిస్ట్,ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ నల్లజాల వెంకట్రావ్, జిల్లా నాయకులు మైస పాపారావు,
నగర అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్,జనార్ధన చారి,కోశాధికారి ఏలూరి వేణు,ప్రెస్ క్లబ్ కోశాధికారి కళ్యాణ్ ,బుర్రి శ్రీనివాస్ ,వైరా ఆహ్వాన కమిటి అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి రాజారావు, ఎన్ టి వి శ్రీను,ఐ న్యూస్ రవి తదితరులు పాల్గొన్నారు.








